
నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులు
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీలో ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులకు చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుల వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం మీడియాకు వెల్లడించింది. విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాదిరెడ్డి నరేంద్రరెడ్డి (అనంతపురం), కార్యదర్శులుగా ఎస్‌కే షెక్షావలి (అనంతపురం), బూచిపల్లి రఘుకుల తేజేష్‌రెడ్డి (శ్రీసత్యసాయి జిల్లా), సహాయ కార్యదర్శులుగా బంగారు వంశీ (అనంతపురం), వేముల అమర్‌నాథ్‌రెడ్డి (శ్రీసత్యసాయి జిల్లా), అఫీషియల్ స్పోక్స్‌పర్సన్‌గా గంగలకుంట కేశవర్ధన్‌రెడ్డి (అనంతపురం)ని నియమించారు.
టీచింగ్ అసోసియేషన్
కార్యవర్గం ఎన్నిక
అనంతపురం సిటీ: అనంతపురం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు విశ్వవిద్యాలయం ఉప కులపతి కార్యాలయంలో బుధవారం సమావేశమయ్యారు. టీచింగ్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్ నారాయణరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షురాలిగా డాక్టర్ జయలక్ష్మి, సెక్రటరీగా డాక్టర్ శారద, జాయింట్ సెక్రటరీగా డాక్టర్ శివకుమార్, ట్రెజరర్‌గా డాక్టర్ విష్ణువర్దన్‌ను ఎన్నుకున్నారు. అనంతరం వారంతా కలసి యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య రంగజనార్దన, రిజిస్ట్రార్ శశిధర్, ప్రిన్సిపాల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ అరుణకాంతిని కలిశారు.
అధ్యాపకుల పాత్ర కీలకం
అనంతపురం: విద్యార్థులను బాధ్యతాయుతపౌరులుగా తీర్చిదిద్దడంలో అధ్యాపకుల పాత్ర చాలా కీలకమని జేఎన్‌టీయూ (ఏ) వీసీ ఆచార్య జి.రంగజనార్దన అన్నారు. విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రధానాచార్యులు, అధ్యాపకులు, ఉమెన్ ఎంపవర్‌మెంట్, ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్లు, వలంటీర్లు, ఉత్తమ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను వివిధ రకాల అవార్డులకు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఎంపికైన వారికి యూనివర్సిటీ ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవార్డులను ఆయన ప్రదానం చేసి, మాట్లాడారు. ప్రస్తుత యాంత్రిక జీవనంలో చాలా మందిలో సామాజిక స్పృహ కొరవడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా కొందరు ప్రవరిస్తున్నారన్నారు. క్షణం తీరిక లేని విధంగా తల్లిదండ్రులు మారిపోయారని, కనీసం తమ పిల్లల వ్యక్తిగత విషయాల్లోనూ వారు శ్రద్ధ పెట్టలేకపోతుండడం బాధాకరమన్నారు. దీంతో ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. ఈ పరిస్థితి నుంచి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా మానవ సంబంధాలు బలపడేలా ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ శశిధర్ ప్రిన్సిపాల్ అరుణకాంతి, డైరెక్టర్లు, బోధన, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.