
పూలే చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి కేవీ ఉషశ్రీచరణ్, ఎమ్మెల్సీ మంగమ్మ
కళ్యాణదుర్గం: బడుగు, బలహీన వర్గాలకు దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్, ఎమ్మెల్సీ మంగమ్మ అన్నారు. కళ్యాణదుర్గంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం పూలే వర్ధంతిని నిర్వహించారు. పూలే చిత్రపటానికి మంత్రి, ఎమ్మెల్సీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యాభివృద్ధికి కోసం పూలే చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జయం ఫణి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ సర్వోత్తమ, నాయకులు బ్రహ్మయ్య, భట్టువానిపల్లి అంజి, హనుమంతరాయుడు, ఉమేష్‌రెడ్డి, మల్లికార్జున, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment