అనంతపురం సెంట్రల్: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి ఈ ఏడాది జిల్లాకు అందాల్సిన హెచ్చెల్సీ నీటి కోటా పూర్తయింది. మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో నీటిని నిలుపుదల చేశారు. ఇప్పటి వరకూ 17.363 టీఎంసీల నీటిని విడుదల చేయగా ప్రవాహ నష్టాలు పోనూ జిల్లా సరిహద్దులో 16.070 టీఎంసీలు చేరినట్లు హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయానికి 495 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 6,802 క్యూసెక్కుల నీటిని కాలువలకు వదులుతున్నారు. కనిష్టంగా 14.814 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. జిల్లాలోని పీఏబీఆర్‌లో 2.403 టీఎంసీలు, ఎంపీఆర్‌లో 0.605 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నట్లు ఎస్‌ఈ రాజశేఖర వివరించారు.