
కొంతమంది అవ్వాతాతలు మసక చూపుతో ఇంట్లోనే ఉండేవారు. ఇప్పుడు ఊరిలోకే డాక్టర్లు వచ్చారన్న విషయం తెలుసుకుని ‘కంటి వెలుగు’ కింద పరీక్షలు చేయించుకున్నారు. వేలాదిమందికి కంటి పరీక్షలు నిర్వహించగా అద్దాలు అవసరమని కొందరికి, క్యాటరాక్ట్ సర్జరీ అవసరమని మరికొందరికి నిర్ధారించారు. అద్దాలు ఉచితంగా ఇస్తున్నారు. క్యాటరాక్ట్ సర్జరీలు అవసరమైన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేయిస్తున్నారు. అనంతపురం జిల్లాలో కంటి డాక్టర్ల కొరత కారణంగా సుమారు 4 వేల మందికి బెంగళూరులో సర్జరీలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.