బూటులో దూరిన పాము.. విద్యార్థికి పాముకాటు | - | Sakshi
Sakshi News home page

బూటులో దూరిన పాము.. విద్యార్థికి పాముకాటు

Jul 7 2023 8:42 AM | Updated on Jul 7 2023 9:25 AM

- - Sakshi

పీడీ మహబూబ్‌బాషా పక్కకు పిలుచుకెళ్లి బూట్లు విప్పించి చూడగా, లోపల నుంచి ఓ పాము బయటకు వచ్చింది.

అనంతపురం: పాఠశాలకు వచ్చిన ఓ విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. వివరాలు.. పెద్దవడుగూరు మండలం కోనాపురం గ్రామానికి చెందిన హరినాథ్‌... నగరూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం 8 గంటలకు పాఠశాలకు చేరుకున్న హరినాథ్‌... ఆవరణలో బూట్లు వదిలి తన హోం వర్క్‌ చేసుకున్నాడు. ఇంతలో బెల్‌ మోగడంతో హడావుడిగా బూట్లు ధరించి ప్రేయర్‌కు హాజరయ్యాడు.

ఇంతలో తన కాలుకు ఏదో కుట్టిందంటూ గట్టిగా అరవడంతో హరినాథ్‌ను పీడీ మహబూబ్‌బాషా పక్కకు పిలుచుకెళ్లి బూట్లు విప్పించి చూడగా, లోపల నుంచి ఓ పాము బయటకు వచ్చింది. వెంటనే పామును చంపేసి, బాధిత విద్యార్థిని తన ద్విచక్ర వాహనంపై తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి పీడీ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆస్పత్రికి చేరుకుని బాధిత విద్యార్థిని పరామర్శించారు.

మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. సకాలంలో విద్యార్థిని ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలపడంతో అక్కడే ఉన్న పీడీ మహబూబ్‌బాషాను ఎమ్మెల్యే అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement