మాతృశాఖకు జీసీడీఓ రెబాకా

- - Sakshi

రాప్తాడురూరల్‌: కేజీబీవీల నిర్వహణలో తీవ్ర అలసత్వం ప్రదర్శించిన సమగ్ర శిక్ష గర్ల్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (జీసీడీఓ) రెబాకాను విధుల నుంచి తప్పించారు. మాతృశాఖకు రీప్యాట్రేషన్‌ చేస్తూ శనివారం రాత్రి కలెక్టర్‌ నాగలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. జీసీడీఓ పోస్టుకు హెచ్‌ఎం అర్హులు. అయితే స్కూల్‌ అసిస్టెంట్‌ అయిన రెబాకా ఈ పోస్టులోకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి విధుల పట్ల నిర్లక్ష్యం, కేజీబీవీల పర్యవేక్షణను గాలికి వదిలేయడంతో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈమె వ్యవహారంపై గతంలో డీపీఓగా పని చేసిన అధికారి నివేదిక ఇచ్చారు. తాజాగా ఓ కేజీబీవీలో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో జీసీడీఓపై వేటు పడింది. జీసీడీఓను మాతృశాఖకు పంపుతూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారని సమగ్రశిక్ష డీపీఓ సాయిరామ్‌ తెలిపారు.

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top