అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలిమర్ సైన్స్ విభాగాధిపతిగా డాక్టర్ కే రాంగోపాల్ నియమితులయ్యారు. ఫిజిక్స్ విభాగానికి చెందిన ఆయన ప్రస్తుతం ఎస్కేయూ పీఆర్వోగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) సహకారంతో నిర్వహిస్తున్న ప్రాంతీయ వాతావరణ పరిశోధన సంస్థ ప్రాజెక్ట్ రాంగోపాల్ ఆధ్వర్యంలో నడుస్తోంది. పాలిమర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్లు అందరూ పదవీ విరమణ చేయడంతో ఫిజిక్స్ విభాగాధిపతిని ఎంపిక చేశారు. ఇదిలా ఉండగా, ఇది వరకు సైన్స్ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న ప్రొఫెసర్ జీవన్ కుమార్ రూసా కోఆర్డినేటర్‌గా ఉన్నారు. ఈయన నెలాఖరులో పదవీ విరమణ చేయనుండడంతో రూసా కోఆర్డినేటర్‌గా ప్రొఫెసర్ నాగరాజును నియమించనున్నారు. ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నాగరాజును తొలిసారిగా అదనపు పదవుల్లో నియమించారు.