చిత్రనాట్య గణపతి.. నృత్య వైభవం | - | Sakshi
Sakshi News home page

చిత్రనాట్య గణపతి.. నృత్య వైభవం

Nov 28 2026 12:38 AM | Updated on Nov 28 2026 12:38 AM

సిరసపల్లి దత్తక్షేత్రానికి నేడు దత్త విజయానంద తీర్థ స్వామిజీ రాక

90 మంది బాలబాలికలతో ప్రత్యేక నృత్య ప్రదర్శన

29న ఎన్టీఆర్‌ క్రీడా మైదానంలో యోగా సాధనలు

అనకాపల్లి: దైవభక్తి, యోగాతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనం సాగించాలని మైసూర్‌ దత్తపీఠం దత్త విజయానంద తీర్థ స్వామిజీ సందేశమివ్వనున్నట్లు చింతామణి గణపతి దత్తక్షేత్ర ప్రతినిధి ఆంజనేయరాజు తెలిపారు. శనివారం సిరసపల్లిలోని చింతామణి గణపతి దత్తక్షేత్రానికి స్వామిజీ విచ్చేయనున్న సందర్భంగా శుక్రవారం ఆలయ ఆవరణలో కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సాయంత్రం 3 గంటలకు స్వామిజీ దత్తక్షేత్రానికి చేరుకుంటారని, 4 గంటలకు 90 మంది బాలబాలికల భాగస్వామ్యంతో ‘చిత్రనాట్య గణపతి’పేరిట ప్రత్యేక కళా, నృత్య ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఇందులో 18 మంది విద్యార్థులు ఐదుగురి చొప్పున బృందాలుగా ఏర్పడి వినాయకుడి దివ్యరూపాలను చిత్రిస్తుండగా, మిగిలిన బాలబాలికలు నృత్య ప్రదర్శనలో పాల్గొంటారని వివరించారు. ప్రముఖ నృత్య సంస్థ నృత్య నికేతన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ నృత్యరూపకానికి వినాయకుడి 108 నామాలతో శంకర్‌ మహాదేవన్‌ ఆలపించిన గానం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. సాయంత్రం 6 గంటలకు లక్షదీపోత్సవం, 7 గంటలకు స్వామిజీ ఆశీర్వచనాలు, రాత్రి 7.30 గంటలకు ఇద్దరు భక్తులకు చింతామణి గణపతి బంధు పురస్కారాల ప్రదానం ఉంటుందని తెలిపారు. ఆదివారం స్థానిక ఎన్టీఆర్‌ క్రీడా మైదానంలో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు స్వామిజీ యోగా ఆసనాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ సభ్యులు శివ, శ్రీనివాస్‌, చక్రధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement