ఎన్నికల నిర్వహణలో ఆర్వోల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణలో ఆర్వోల పాత్ర కీలకం

Nov 28 2026 12:38 AM | Updated on Nov 28 2026 12:38 AM

●కలెక్టర్‌ విజయ కృష్ణన్‌

యలమంచిలిలో ఆర్వోలకు సూచనలిస్తున్న కలెక్టర్‌ విజయ కృష్ణన్‌

యలమంచిలి రూరల్‌: ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్‌ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ అన్నారు. యలమంచిలి ఎంపీడీవో కార్యాలయం పక్కనున్న వెలుగు కుట్టు శిక్షణా కేంద్రం భవనంలో శుక్రవారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల స్టేజ్‌–2 ఆర్వోల శిక్షణా శిబిరాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆర్వోలకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియలను పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు.

బాధ్యతగా ఎన్నికల విధులు

నక్కపల్లి: రెండో విడత పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ సూచించారు. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే ఆర్‌వోలు, ఇతర పోలింగ్‌ సిబ్బందితో శుక్రవారం ఆమె సమీక్ష నిర్వహించారు. నక్కపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో పాయకరావుపేట, నక్కపల్లి మండలాల ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వద్ద కనీస సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, అడ్డరోడ్డు ఆర్డీవో కేవీ రామలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement