బాల్య, బలవంతపు వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి | - | Sakshi
Sakshi News home page

బాల్య, బలవంతపు వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి

Nov 28 2026 12:38 AM | Updated on Nov 28 2026 12:38 AM

మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో అచ్యుతకుమారి

అనకాపల్లి: బాల్య వివాహాలు, బలవంతపు వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డీఎంఅండ్‌హెచ్‌వో) డాక్టర్‌ అచ్యుతకుమారి, మహిళా శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి ఎన్‌.సూర్యలక్ష్మి పిలుపునిచ్చారు. స్థానిక మెయిన్‌రోడ్డులోని జీవీఎంసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా బాలల సంరక్షణ విభాగం, స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్భంగా డాక్టర్‌ అచ్యుతకుమారి మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల బాలికల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. విద్యాభ్యాసం, భవిష్యత్తు, వ్యక్తిగత అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. బాల్య వివాహాలు బాలల హక్కులకు భంగం కలిగించడమే కాకుండా చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. చిన్న వయస్సులో గర్భధారణ జరిగితే తల్లీబిడ్డలిద్దరికీ ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎన్‌.సూర్యలక్ష్మి మాట్లాడుతూ బాల్య, బలవంతపు వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ‘బాల్‌ వివాహ్‌ ముక్త్‌ భారత్‌’ప్రచార స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. 2030 నాటికి బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించే లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీడ్‌ అధ్యక్షుడు సూర్యప్రకాష్‌, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి వినోద్‌కుమార్‌, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎం.రమేష్‌, డాక్టర్‌ ఇస్తార్‌ రాణి, జిల్లా ప్రోగ్రామ్‌ మేనేజర్‌ (ఎన్‌సీడీ) ఎం.కె.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement