● కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు ● వైజాగ్‌ లిటరరీ ఫెస్టివల్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

● కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు ● వైజాగ్‌ లిటరరీ ఫెస్టివల్‌ ప్రారంభం

Nov 22 2026 2:47 AM | Updated on Nov 22 2026 2:47 AM

● కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు ● వైజాగ్‌ లిటరరీ ఫెస్టివల్‌ ప్రారంభం

విభిన్న కోణాల్లో జ్ఞానం పంచేవి పుస్తకాలే..

ఏయూ క్యాంపస్‌: విభిన్న కోణాల్లో ఆలోచించే జ్ఞానాన్ని పుస్తకాలే అందిస్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు అన్నారు. బీచ్‌రోడ్డులోని హవామహల్‌లో నిర్వహిస్తున్న వైజాగ్‌ లిటరరీ ఫెస్టివల్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం చిన్నారులను ఉద్దేశించి మాట్లాడారు. పిల్లలను ఎక్కువగా పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. అవసరమైతే తల్లిదండ్రులు కూడా వారితో కలిసి పుస్తకాలు చదవాలని చెప్పారు. పిల్లలను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచి పుస్తకాల ప్రపంచానికి చేరువ చేయాలని సూచించారు. ఇలాంటి సాహిత్య ఉత్సవాన్ని శ్రీకాకుళంలోనూ నిర్వహించాలని, మరింత మంది భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. దక్షిణ భారతదేశంలో అనేక సాహిత్య ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ఏకై క ఉత్సవంగా ‘వైజాగ్‌ జూనియర్‌ లిటరరీ ఫెస్ట్‌’ నిలుస్తుందని పేర్కొన్నారు. ఎంపీ ఎం.శ్రీభరత్‌ మాట్లాడుతూ విశాఖ వేదికగా నిర్వహిస్తున్న ఈ చిన్నారుల సాహిత్య ఉత్సవానికి మంచి ఆదరణ లభిస్తోందన్నారు.

పుస్తకాలు, రచయితలను పిల్లలకు పరిచయం చేయడం ద్వారా భవిష్యత్తులో మంచి పాఠకులు, రచయితలను తీర్చిదిద్దినట్లవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు ప్రియ ఉప్పలపాటి, సోనాల్‌ శారద, సంధ్య గోడే తదితరులు ప్రసంగించారు. అనంతరం ముంబయికి చెందిన మైమ్‌ కళాకారుడు కునాల్‌ మోట్లింగ్‌ ప్రదర్శించిన మూకాభినయం చిన్నారులను ఆకట్టుకుంది. ఫెస్టివల్‌లో భాగంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలో చిన్నారులకు సంబంధించిన వందలాది పుస్తకాలను అందుబాటులో ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement