33 అడుగుల క్రీస్తు స్వరూప మహా ప్రతిష్ట రేపు | - | Sakshi
Sakshi News home page

33 అడుగుల క్రీస్తు స్వరూప మహా ప్రతిష్ట రేపు

Nov 7 2026 12:42 AM | Updated on Nov 7 2026 12:42 AM

కంచరపాలెం: జ్ఞానాపురం రక్షణగిరిలో 33 అడుగుల దివ్య రక్షకుడు క్రీస్తు స్వరూప మహా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు విశాఖ ఆర్చిబిషప్‌ రెవరెండ్‌ ఫాదర్‌ డాక్టర్‌ ఉడుముల బాల ప్రారంభించనున్నట్లు వార్డు కార్పొరేటర్‌ కోడిగుడ్ల పూర్ణిమ, వైఎస్సార్‌సీపీ వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్‌ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తయిన క్రీస్తు స్వరూపంగా ఇది నిలవనుందని తెలిపారు. సుమారు 33 అడుగుల ఎత్తైన క్రీస్తు స్వరూపం బేస్‌మెంట్‌తో కలిపి 55 అడుగుల ఎత్తులో ఉంటుందని పేర్కొన్నారు.విశాఖలో జీసెస్‌ స్వరూపం ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో దీనిని నిర్మించినట్లు పూర్ణిమ, శ్రీధర్‌ తెలిపారు. సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన జ్ఞానాపురం రక్షణగిరిలో నిర్మించిన ఈ క్రీస్తు స్వరూపానికి దాతలుగా నిలవడం తమకు ఆనందంగా ఉందన్నారు. విశాఖ ప్రజలపై క్రీస్తు దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement