అనకాపల్లి బెల్లానికి దీపావళి ధమాకా | - | Sakshi
Sakshi News home page

అనకాపల్లి బెల్లానికి దీపావళి ధమాకా

Nov 8 2026 12:37 AM | Updated on Nov 8 2026 12:37 AM

సాక్షి, అనకాపల్లి : జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్‌కు దీపావళి ధమాకా తగలింది. అనకాపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శనివారం రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు 8,680 రూపాయలు పలికింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ధర పలకడం గమనార్హం. దీపావళి మిఠాయిలు, నాగులచవితికి ఉపయోగించి సిమ్మిడి తయారీలో బెల్లాన్ని అధికంగా వినియోగిస్తారు. శనివారం సుమారు 200 బెల్లం దిమ్మలు వచ్చినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. శుక్రవారం క్వింటాల్‌ 7,770 రూపాయిల ధర పలికింది. ఒక్క రోజు వ్యవధిలో క్వింటాల్‌కు 910 రూపాయలు పెరిగింది. శుక్రవారం మార్కెట్‌కు 300 దిమ్మలు వరకూ వచ్చినట్టు సమాచారం. ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో చాలా చోట్ల చెరకు తోటలకు కూడా నష్టం వాటిల్లింది. మరోవైపు అనకాపల్లి జిల్లాలో బెల్లం తయారీకి ఉపయోగించే చెరకు విస్తీర్ణం తగ్గిపోతున్న తరుణంలో పెరిగిన ధరలు చెరకు రైతులకు ఊరటనిచ్చే అంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement