● మన్యం ఓటరు విలక్షణ తీర్పు
● కూటమి ప్రలోభాలకు చెక్
● ఆరు జెడ్పీటీసీలు కై వసం
● జగన్ నాయకత్వానికి మద్దతు
కూటమి నేతల ప్రలోభాలు.. రూ.కోట్లలో పంపిణీ.. ఏవీ గిరిజన ఓటర్ల తీర్పును మార్చలేకపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీ వైపే మన్యం ఓటర్లు మొగ్గుచూపారు. జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై తమకున్న అభిమానాన్ని ఓట్ల రూపంలో చాటారు.
11 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఆరు స్థానాలను కై వసం చేసుకుని జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై ఆశలు సజీవంగా నిలుపుకున్నారు. మిగతా చోట్ల కొన్నింటిలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ముందజలో ఉన్నారు.
సాక్షి, పాడేరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వానికి గిరిజన ఓటర్లు మరోసారి మద్దతు పలికారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అధికారంలో ఉన్న కూటమి పార్టీల ప్రలోభాలకు మెజారిటీ గిరిజన ఓటర్లు లొంగకుండా తమ తీర్పును వెల్లడించారు. కూటమి పార్టీలు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఓటర్లు వాటిని పట్టించుకోలేదు. చివరకు ఫ్యాన్ గుర్తుపైనే ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించారు. ఈ విజయాలను జగన్మోహన్రెడ్డికి కానుకగా అందించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి జరిగిన పలు ఎన్నికల్లో జిల్లా ఓటర్లు ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్నారు. 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో అరకు ఎంపీ, అరకులోయ, పాడేరు ఎమ్మెల్యే స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులనే గెలిపించారు. అలాగే 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతగిరి జెడ్పీటీసీ, జి.మాడుగుల ఎంపీపీ పదవులు మినహా మిగిలిన పది మండలాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని సైతం ముంచంగిపుట్టు జెడ్పీటీసీ సుభద్రకు దక్కేలా జగన్ అవకాశం కల్పించారు. ఐదేళ్లపాటు వైఎస్సార్సీపీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు గిరిజన ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు. ప్రస్తుతం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మద్దతు పలకడం ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా ఓటర్లు మరోసారి జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై తమ విశ్వాసాన్ని చాటుకున్నారు. ఈ ఎన్నికల్లో జిల్లాలోని 11 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఇప్పటికే ఆరు స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని అధిష్టించేందుకు ఆ పార్టీకి మార్గం సుగమమైంది. గూడెంకొత్తవీధి, చింతపల్లి, పాడేరు, పెదబయలు, డుంబ్రిగుడ, అనంతగిరి జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మిగతా స్థానాల్లో కూడా మరికొన్ని కైవసం చేసే అవకాశం ఉంది. దీనికి ఇమేజ్ క్రియేట్ చేయాలి
వైఎస్సార్సీపీదే జెడ్పీ పీఠం


