టి.సిరసపల్లి రీపోలింగ్‌కు కూటమి పట్టు
అదే జరిగితే ఇతర సెగ్మెంట్‌కు కూడా రీ–పోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ ఆందోళన
రీ–పోలింగ్ నిర్వహించబోమంటూ అధికారుల ప్రకటన
మునగపాక: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శనివారం జరిగిన కౌంటింగ్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అఽధికార పార్టీ నేతలకు అధికారులు తలొగ్గి రీ కౌంటింగ్ చేయాలని డిమాండ్ చేయడంతో వైఎస్సార్‌సీపీ నేతలు అధికారుల తీరును తప్పుపట్టి కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళన నిర్వహించారు. మునగపాక మండలం టి.సిరసపల్లి వైఎస్సార్‌సీసీ తరపున ఎంపీటీసీగా బొడ్డేడ వీరలక్ష్మి 18 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఈ గెలుపును జీర్ణించుకోలేని కూటమి నేతలు రీ పోలింగ్‌కు డిమాండ్ చేయడంతో గందరగోళం నెలకొంది. అలా అయితే పల్లపు ఆనందపురం నుంచి జనసేన తరపున అరిగా శ్రీనివాసరావు 14 ఓట్లతో గెలిచారని ఈ సెగ్మెంట్‌కు కూడా రీ పోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాల వారు కౌంటింగ్ కేంద్రం వద్ద అరుపులు, కేకలతో దద్దరిల్లింది. సిరసపల్లికి రీ పోలింగ్ నిర్వహిస్తే పల్లపు ఆనందపురం సెగ్మెంట్‌కు కూడా రీ పోలింగ్ నిర్వహించాలని లేకుంటే కౌంటింగ్ కేంద్రం వద్ద బైటాయిస్తామంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు హెచ్చరించడంతో పోలీసు ఉన్నతాధికారులు రంగప్రవేశం చేసి వివాదాన్ని సద్దుమణిగేలా చర్యలు తీసుకున్నారు. రీ పోలింగ్‌కు అవకాశం లేదంటూ ఎన్నికల అధికారి నుంచి ఆదేశాల రావడంతో వివాదం సర్దుమణి గింది.


