ఫ్యాన్‌కు అత్యధిక ఓట్లు | - | Sakshi
Sakshi News home page

ఫ్యాన్‌కు అత్యధిక ఓట్లు

Nov 8 2026 12:37 AM | Updated on Nov 8 2026 12:37 AM

కూటమికి సీట్లు

24 జెడ్పీటీసీ స్థానాలు కూటమిపరం 75 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపు మునగపాక మండలంలో చెరో 8 చొప్పున గెలుపు ఓట్ల లెక్కింపులోనూ సిబ్బంది తీరుపై విమర్శలు చెల్లని ఓట్ల విషయంలో మొండిగా వ్యవహరించిన సిబ్బంది

బ్యాలెట్‌ బాక్సులను తరలిస్తున్న సిబ్బంది

కూటమికి సీట్లు

సాక్షి, అనకాపల్లి : జిల్లాలో శనివారం వెల్లడైన పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో కూటమిదే పై చేయి అయ్యింది. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయానికి తెరలేపిన ప్రలోభాలతోనే కూటమి మెజారిటీ స్థానాల్లో విజయం సాఽధించింది. పోటీ చేసిన అభ్యర్థులకు బెదిరింపులు, ప్రజా బలం ఉన్న నేతలపై బైండోవర్‌ కేసులు, స్లిప్పుల పంపిణీ, లెక్కల్లో తేడాలు, చివరకు చెల్లని ఓట్ల లెక్కింపు విషయంలో సిబ్బంది ప్రదర్శించిన మొండి వైఖరి ముందు ప్రజాస్వామ్యానికి సంకెళ్లు తప్పలేదు. జెడ్పీటీసీ స్థానాల్లో మొత్తంగా వైఎస్సార్‌సీపీ అత్యధిక ఓట్లు సాధించినా ఒక్క సీటూ దక్కలేదు. ఏదేమైనా అధికార సిబ్బంది వెల్లడించిన లెక్కల ప్రకారం కూటమికి మెజారిటీ స్థానాలు దక్కాయి.

స్వల్ప మెజారిటీ వచ్చిన చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయాన్ని ప్రకటించేందుకూ ఎన్నికల సిబ్బంది ఆసక్తి చూపకపోవడం, కావాలని రీ కౌంటింగ్‌కు కూటమి నేతలు పట్టుబట్టడంతో చాలా చోట్ల వాగ్వాదాలు జరిగాయి. అదే కూటమి అభ్యర్థులకు స్వల్ప మెజారిటీ వస్తే వెనువెంటనే ఫలితాన్ని ప్రకటించడం ద్వారా ఎన్నికల సిబ్బంది తమ స్వామి భక్తిని ప్రదర్శించారు.

మునగపాక మండలంలో నువ్వా నేనా..!

జిల్లాలోని మునగపాక మండల పరిషత్‌కు నిర్వహించిన ఎన్నికలు హోరాహోరీ ఫలితాలను వెలువరించేలా చేశాయి. ఇక్కడ 16 ఎంపీటీసీ స్థానాలకు చెరో 8 స్థానాలకు కై వసం చేసుకున్న పాలక,ప్రతిపక్ష పార్టీలు ఎంపీపీ పీఠంపై కన్నేశాయి. ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో ఆసక్తిగా మారింది.

హోంమంత్రికి ఝలక్‌..

బండారు బ్యాడ్‌ లక్‌...

జిల్లాలో కొన్ని చోట్ల ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. పాయకరావుపేట నియోజకవర్గంలోని హోం మంత్రి ఉండే నక్కపల్లి మండలంలోని రెండు సెగ్మెంట్‌లో వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది.అదే విధంగా మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి స్వంత గ్రామమైన వెన్నెలపాలెం సెగ్మెంట్‌ను వైఎస్సార్‌సీపీ గెలుచుకొని సంచలనం సృష్టించింది.

కలెక్టర్‌ సందర్శన

కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులపై జిల్లా కలెక్టర్‌ ఆరా తీశారు. పెదబొడ్డేపల్లి పరిధిలోని డాన్‌ బాస్కో డిగ్రీ, పీజీ కళాశాలలోని కౌంటింగ్‌ కేంద్రాన్ని, నర్సీపట్నంలోని అల్లూరి సీతారామరాజు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ సందర్శించి ఆరా తీశారు.

ఆలస్యంగా ఫలితాలు

మిగిలిన జిల్లాలతో పోలిస్తే అనకాపల్లి జిల్లాలోని పలు కౌంటింగ్‌ కేంద్రాల్లో ఫలితాలు ఆలస్యంగా వెలువడ్డా యి. దీనిపై జిల్లా ఎన్నికల పర్యవేక్షణ అధికారులు సైతం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కౌంటింగ్‌ ఆలస్యం వెనుక సిబ్బంది అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఏదేమైనా పరిష త్‌ ఎన్నికల ఫలితాల వెల్లడి, గెలిచిన వారికి ధృవీకరణ పత్రాలు అందించడం ద్వారా పరిషత్‌ పోరు ముగిసినట్లయ్యింది.

కౌంటింగ్‌ కేంద్రంలో ఓట్ల లెక్కింపులో నిమగ్నమైన ఎన్నికల సిబ్బంది (ఇన్‌సెట్‌)

ఫలితాలు ఇలా...

జిల్లాలోని 24 జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. 425 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ 75 కై వసం చేసుకుంది. ఇప్పటికే 2 సీట్లు ఏకగ్రీవం కాగా, మిగిలిన చోట్ల కూటమి విజయం సాఽధించింది. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ విషయంలో తొలి నుంచి కూటమి అభ్యర్థులకు వివిధ శాఖల అధికారులు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే కూటమి నేతల సిఫారసు మేరకు చాలా చోట్ల బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగానే సాగినప్పటికీ హోంమంత్రి నియోజకవర్గంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు కశింకోట మండలంలోని అచ్చెర్లలో ఎంపీటీసీ, జెడ్పీడీసీ అభ్యర్థులకు పోలైన ఓట్లలో వ్యత్యాసం కనిపించి ప్రతిఘటించినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అనకాపల్లి మండలంలోని రొంగలివానిపాలెంలో స్థానికులు రిజర్వేషన్‌ మార్పుపై పోరాటం చేసి ఎన్నికల్ని బహిష్కరించినప్పటికీ ఎటువంటి రీ పోలింగ్‌కు ఆదేశించకపోవడం గమనార్హం. ఎన్నికల రోజు ముందు పంపిణీ చేయాల్సిన ఓటర్ల స్లిప్పుల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందినప్పటికీ ఎటువంటి చర్యలు లేవు. కౌంటింగ్‌ సమయంలో ఎన్నికల సిబ్బంది వ్యవహరించిన తీరు ఆక్షేపణీయంగా మారింది. కౌంటింగ్‌ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీకి పడిన ఓట్లలో చిన్నపాటి కారణాలను చూపి ఇన్‌వ్యాలీడ్‌గా పరిగణించడంపై ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేసినా సిబ్బంది ఏకపక్షంగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement