రోలుగుంట : పెదబొడ్డేపల్లిలో శనివారం జరిగిన ఓట్ట లెక్కింపుల్లో సంబంధం లేని టార్చిలైట్ గుర్తు బ్యాలెట్ పత్రంలో ప్రత్యక్షమయింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలో నలుగురు జెడ్పీటీసీ అభ్యర్థులు పోటీ చేశారు. ఈ నెల 5న పోలింగ్ కూడా జరిగింది. ఓట్ల లెక్కింపు కేంద్రం అయిన పెదబొడ్డేపల్లి డాన్‌బాస్కో డిగ్రీ కళాశాలలో గల స్ట్రాంగ్రూముకి పోలీసు బందోబస్తుతో బ్యాలెట్ బాక్సులు అదే రోజు చేరాయి. స్ట్రాంగ్‌రూంకు సీల్ వేయడం జరిగింది. శనివారం ఓట్ల లెక్కింపు కోసం బ్యాలెట్ బాక్సులను లెక్కింపు కేంద్రానికి తీసుకొచ్చి కౌంటింగ్ చేపట్టినపుడు బ్యాలెట్ పత్రాల్లో టార్చ్‌లైట్ గుర్తు ఉన్న పత్రాలు బయటపడ్డాయి. ఏజెంట్ ద్వారా విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కౌటింగ్ అధికారుల వద్దకు వచ్చి సంబంధం లేని టార్చిలైటు గుర్తు బ్యాలెట్లు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. ఈ తప్పిదం ఎలా జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కౌంటింగు అధికారులు ఆర్వో దృష్టికి తీసుకెళతామని సమాధానపరిచారు. జెడ్పీటీసీ అభ్యర్థి మాత్రం దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, ఇది అధికార పార్టీ నాయకులు, వారికి తొత్తులుగా పని చేస్తున్న అధికారుల తప్పిదమేనన్నారు.


