అప్రమత్తతతోనే ఆనంద దీపావళి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తతతోనే ఆనంద దీపావళి

Nov 8 2026 12:49 AM | Updated on Nov 8 2026 12:49 AM

వెలుగుల పండగకు

జాగ్రత్తలు తప్పనిసరి

పిల్లల విషయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి

అనకాపల్లి టౌన్‌ : చీకటిని ప్రాదద్రోలి వెలుగులు నింపే దీపావళి పండుగను ఆదివారం జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఇంటికి రకరకాల విద్యుత్‌ అలంకరణలు, ప్రమిదల వెలుగులు, టపాసులు పేల్చడానికి సిద్దమైన ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఇంటిలో లక్ష్మిదేవికి పూజ చేసి, చెరకు గెడ, ఆముదం కర్రలతో కూడిన దివ్వెలను వెలిగించిన అనంతరం టపాసులు కాల్చుతారు. అయితే తమ తమ స్ధాయిలో టపాసులు కొనుక్కొని ఇంటికి తెచ్చి, ఆంనందోత్సాహాల మద్య, సరదా కోసం కాల్చే టపాసుల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. ఈ దీపావళి పండగ అంటే ముఖ్యంగా చిన్నారులకు ఎంతో ఇష్టమైన పండగ. అలాగే పెద్దలు కూడా ఆనందంగా టపాసులు కాల్చుతుంటారు. రంగురంగుల బాణసంచా కాల్చేందుకు పిల్లలు ఆసక్తి చూపుతుంటారు. అయితే పెద్దల పర్యవేక్షణ లేకుండా పిల్లలకు టపాసులు ఇవ్వకూడదని పలువురు సూచిస్తున్నారు. అప్రమత్తత లేకపోతే జరిగే ప్రమాదాలపై ముందుగానే వారికి అవగాహన కల్పించాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు.

●బాణాసంచా కాల్చేటప్పుడు బహిరంగ ప్రదేశాలను ఎంచుకోవాలి.

●ఇళ్ల సమీపంలో, వాహనాల పక్కన, విద్యుత్‌ తీగల కిద టపాసులు కాల్చరాదు.

●టపాసులు కాల్చేటప్పుడు చేతితో పట్టుకోకుండా నేలపై ఉంచి పొడవైన అగరబత్తితో వెలిగించాలి.

●మందుగుండు సామాన్లు కాల్చే సమయంలో కాటన్‌ దుస్తులు ధరించాలి.

●మందుగుండు వెలిగించే ప్రాంతంలో ఒక బకెట్‌ ఇసుక, నీరు అందుబాటులో ఉంచుకోవాలి.

●ఒకసారి వెలిగించిన టపాసు కాలకపోతే తిరిగి వెలిగించే ప్రయత్నం చేయరాదు.

●ఇళ్లలో దీపాలు వెలిగించేటప్పుడు కర్టెన్లు, కాగితాలు, ఇతర మండే వస్తువులను దూరంగా ఉంచాలి.

●విద్యుత్‌ దీపాలు అలంకరణలో నాణ్యమైన వైర్లు, ప్లగ్‌లు ఉపయోగించాలి.

●బాణాసంచా కాల్చేటప్పుడు కాళ్లకు చెప్పులు, బూట్లు తప్పని సరిగా ధరించాలి

●బాణాసంచా కాల్చిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

●కళ్లకు, చేతులకు గాయాలైనప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే సమీపంలో ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ సలహాపై వైద్యం పొందాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement