టీడీపీ కంచుకోటలో వైఎస్సార్‌సీపీ పాగా | - | Sakshi
Sakshi News home page

టీడీపీ కంచుకోటలో వైఎస్సార్‌సీపీ పాగా

Nov 8 2026 12:49 AM | Updated on Nov 8 2026 12:49 AM

30 ఏళ్ల తర్వాత ఎంపీటీసీ స్థానాలు కై వసం

మత్స్యకార గ్రామాల్లో ఫ్యాన్‌ గాలి

రాజయ్యపేటలో అత్యధిక మెజార్టీ

నక్కపల్లి: టీడీపీ కంచుకోటలో ఈ దఫా పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పాగా వేసింది. మూడు దశాబ్దాల తర్వాత మత్స్యకార గ్రామాల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మండలంలో గత సార్వత్రిక ఎన్నికల్లో హోంమంత్రి వంగలపూడి అనితకు 1500 ఓట్ల మెజార్టీ ఇచ్చిన రాజయ్యపేటలో ఈ దఫా ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంది. ఇక్కడ ఎంపీటీసీ అభ్యర్థిగా పిక్కి కాశీ తన ప్రత్యర్థి పిక్కి రమణ(కూటమి)పై 664 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పెదతీనార్ల మత్స్యకార గ్రామంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మైలపల్లి సరోనా తన సమీప ప్రత్యర్థి మైలపల్లి రమాదేవిపై 85 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరో మత్స్యకార గ్రామం బంగారయ్యపేట సెగ్మెంట్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొవిరి రమణ తన సమీప టీడీపీ అభ్యర్థి ఏవీఎస్‌ రాజుపై 161 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ సెగ్మెంట్లన్నీ గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్నాయి. మత్స్యకారులంతా 40 ఏళ్లనుంచి టీడీపీకే ఓటేస్తూ వస్తున్నారు. ప్రధానంగా రాజయ్యపేటలో 6,500 పైచిలుకు ఓటర్లు ఉన్నారు. స్థానిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో ఈ గ్రా మం నుంచి టీడీపీకి 80 శాతం ఓట్లు లభిస్తాయి. ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీకి 2 నుంచి 3 వేల ఆధిక్యత లభించేది. అటువంటిది ఈ ఎన్నికల్లో రాజయ్యపేటలో ఫ్యాన్‌ గాలి బలంగా వీచింది. మత్స్యకారులంతా వైఎస్సార్‌సీపీనే ఆదరించారు. ఎక్కువ ఓట్లు కలిగిన రాజయ్యపేట, పెదతీనార్ల, బంగారయ్యపేట గ్రామాల్లో వైఎస్సార్‌సీపీని ఆదరించడం చర్చనీయాంశమైంది. రాజయ్యపేటలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మండలంలోనే అత్యధికంగా 664 ఓట్ల మెజార్టీ రావడాన్ని అధికార పార్టీకి పెద్ద దెబ్బ అని పలువురు అంటున్నారు.

అక్రమ మద్యం విక్రేత అరెస్టు

అనకాపల్లి టౌన్‌ : మండలంలోని కొత్తూరు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మోసూరి ప్రకాశరావు నుంచి 24 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని, అరెస్ట్‌ చేసినట్టు ఎకై ్సజ్‌ సీఐ లక్ష్మీనాయుడు తెలిపారు. ఎకై ్సజ్‌ చట్టం ప్రకారం అక్రమంగా మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ కె.ఎస్‌.గణేష్‌, సిబ్బంది ఎం.వి.ఎస్‌. రమేష్‌, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలకు అభినందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement