చెరువులోకి దూసుకెళ్లిన కారు | - | Sakshi
Sakshi News home page

చెరువులోకి దూసుకెళ్లిన కారు

Nov 3 2026 1:09 AM | Updated on Nov 3 2026 1:09 AM

యువకుడి మృతి

అక్కిరెడ్డిపాలెం: నాతయ్యపాలెంలోని క్రిష్టా మహంతి చెరువులోకి కారు దూసుకెళ్లడంతో అందులో యువకుడు మృతి చెందాడు. గాజువాక ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిపాలెం అంబేడ్కర్‌ కాలనీకి చెందిన కిళ్లి వరుణ్‌కుమార్‌ (26) సోమవారం తెల్లవారుజామున కారులో నాతయ్యపాలెం నుంచి షీలానగర్‌ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో క్రిష్టా మహంతి చెరువు వద్ద ఉన్న భారీ మలుపును గమనించకపోవడంతో కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. చెరువులో నీరు ఎక్కువగా ఉండటంతో కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కారులో ఉన్న వరుణ్‌కుమార్‌ను బయటకు తీశారు. అనంతరం సమీపంలోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement