● 1800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ● ఒక్కరోజులోనే మీటర్ పెరిగి 104 మీటర్లకు చేరిన నీటిమట్టం
దేవరాపల్లి: తుఫాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైవాడ జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. గురువారం 1800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుందని జలాశయం డీఈఈ జి. సత్యంనాయుడు తెలిపారు. దీంతో ఒక్క రోజు వ్యవధిలోనే మీటరు మేర జలాశయం నీటిమట్టం పెరిగిందని ఆయన తెలిపారు. కాగా జలాశయం నీటిమట్టం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 104 మీటర్లకు చేరుకుంది. వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో జలాశయంలోకి మరింత ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


