తుమ్మపాల/అనకాపల్లి టౌన్ : జిల్లాలో 2026–27 సంవత్సరానికి మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి 39 షాపులకు నోటిఫికేషన్ విడుదలైందని జిల్లా ఎకై ్సజ్ అధికారి సుధీర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కొనసాగుతున్న 155 మద్యం దుకాణాల కాలపరిమితి ఈ నెల 30తో ముగియనుందని, వీటిలో 140 ఓపెన్‌న్‌కేటగిరీ, 15 గీత కులాలకు కేటాయించిన దుకాణాలు ఉన్నాయన్నారు. అక్టోబరు 1 నుంచి 2027 సెప్టెంబరు 30 వరకు) దుకాణాలను రెన్యువల్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. రెన్యువల్ కోసం ప్రభుత్వం నిర్ధేశించిన గడువు సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి 12 గంటలతో ముగిసిందన్నారు. ఈ అవకాశాన్ని 122 మంది దుకాణ యజమానులు వినియోగించుకున్నారన్నారు. వీటిలో 107 ఓపెన్‌న్‌కేటగిరీ, 15 గీత కులాలకు కేటాయించిన దుకాణాలు ఉన్నాయని పేర్కొన్నారు.
39 దుకాణాలకు కొత్తగా నోటిఫికేషన్
రెన్యువల్ చేసుకోని 33 ఓపెన్ కేటగిరీ దుకాణాలు, గత లీజు సంవత్సరంలో సరెండర్, రద్దు చేసిన 6 ఓపెన్ కేటగిరీ దుకాణాలు కలిపి మొత్తం 39 దుకాణాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. మద్యం దుకాణాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గురువారం నుంచే ప్రారంభమైందని, అక్టోబరు 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్ ( https:// oc. hpfsproject. com? utm& source= chatgpt. com ) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం అక్టోబరు 5న ఉదయం 8 గంటలకు అనకాపల్లి గుండాల జంక్షన్‌లోని ఎస్.ఆర్.శంకరన్ మీటింగ్ కాంప్లెక్స్‌లో లాటరీ ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపారు.


