యలమంచిలి రూరల్: యలమంచిలి పట్టణానికి సమీపంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను శనివారం సీజ్ చేసినట్టు తహసీల్దార్ కె.వరహాలు తెలిపారు.16వ నంబరు జాతీయ రహదారిపై నుంచి పట్టణంలోని పైవంతెన మీదుగా గ్రావెల్ తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను గుర్తించిన తహసీల్దార్ వాటిని స్వయంగా ఆపి అనుమతులు ఉన్నాయో?లేదో? పరిశీలించారు. అనుమతులు లేకుండా పెదపల్లి సమీపంలో ఒక క్వారీ నుంచి తవ్వకాలు జరిపి తరలిస్తున్నట్టు నిర్థారించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. రెండు ట్రాక్టర్లు తనవేనని పట్టణంలోని రాంనగర్‌కు చెందిన పడాల శ్రీను తహసీల్దార్‌ను సంప్రదించారు. అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నందుకు ఒక్కో ట్రాక్టరుకు రూ.15వేల చొప్పున మొత్తం రూ.30 వేలు జరిమానా విధించినట్టు తహసీల్దార్ ‘సాక్షి’కి తెలిపారు.


