అచ్యుతాపురం రూరల్: భార్య మందలించిందన్న మనస్తాపంతో పురుగుమందు తాగిన మండలంలోని పెదపాడుకు చెందిన జనపరెడ్డి నాగసూరి (51) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాగుడుకు అలవాటు పడిన నాగసూరి మూడేళ్లుగా దానికి దూరంగా ఉంటున్నాడు. ఇటీవల మళ్లీ మద్యం సేవించడంతో భార్య మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఈ నెల 11న పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటరావు తెలిపారు.


