రావికమతం: మండలంలోని కొత్తకోటలో శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. కొత్తకోట ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తకోట గ్రామానికి చెందిన బడుగుశెట్టి కార్తీక్, కొప్పోజు వీర సత్యరాణి ఉదయం గ్రామంలో హైస్కూల్‌కు వెళుతుండగా, అదే గ్రామానికి చెందిన అద్దిపల్లి ఆర్యకుమార్ బైక్‌తో ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన కార్తీక్, సత్యరాణిలను నర్సీపట్నంలో ఆస్పత్రికి తరలించారు. బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు ఆర్య కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.


