ఆకట్టుకున్న పురాతన నాణేల ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న పురాతన నాణేల ప్రదర్శన

Sep 20 2026 12:45 AM | Updated on Sep 20 2026 12:45 AM

ఎస్‌.రాయవరం: విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు పురాతన నాగరికతపై అవగాహన కల్పించడం అభినందనీయమని అనకాపల్లి జిల్లా ఉప విద్యాశాఖాధికారి పి.అప్పారావు తెలిపారు. శనివారం కొరుప్రోలు ఉన్నత పాఠశాలలో మండల స్థాయి నాణేల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇక్కడ హెచ్‌ఎం కె.ప్రసాద్‌ సేకరించిన 60 దేశాలకు సంబంధించి 500 ఏళ్ల క్రితం నాటి నాణేలను ప్రదర్శనలో ఉంచారు. పలు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈవో మాట్లాడుతూ చరిత్ర ఆనవాళ్లకు నాణేలని, వాటి గురించి విద్యార్థులకు చదువుతో పాటు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement