పండగల రద్దీకి ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

పండగల రద్దీకి ప్రత్యేక రైళ్లు

Sep 20 2026 12:45 AM | Updated on Sep 20 2026 12:45 AM

తాటిచెట్లపాలెం(విశాఖ): పండగల రద్దీ దృష్ట్యా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు విశాఖపట్నం డివిజన్‌ అధికారులు తెలిపారు. చర్లపల్లి–సంత్రగచ్చి (07221) వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతి శనివారం ఉదయం 5.40 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి అదే రోజు రాత్రి 7.33 గంటలకు దువ్వాడకు, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటుంది. ఈ రైలు అక్టోబర్‌ 31 వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో సంత్రగచ్చి–చర్లపల్లి (07222) వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12.25 గంటలకు సంత్రగచ్చిలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.20 గంటలకు దువ్వాడకు, అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైలు నవంబర్‌ 1 వరకు నడుస్తుంది.

● ఎస్‌ఎంవీ బెంగళూరు–మాల్డా టౌన్‌ (06565) వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతి ఆదివారం రాత్రి 11.40 గంటలకు ఎస్‌ఎంవీ బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.13 గంటలకు దువ్వాడకు, మంగళవారం సాయంత్రం 4.35 గంటలకు మాల్డా టౌన్‌ చేరుకుంటుంది. ఈ రైలు నవంబర్‌ 22 వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో మాల్డా టౌన్‌–ఎస్‌ఎంవీ బెంగళూరు (06566) వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతి బుధవారం సాయంత్రం 4 గంటలకు మాల్డా టౌన్‌లో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.33 గంటలకు దువ్వాడకు, శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటలకు ఎస్‌ఎంవీ బెంగళూరు చేరుకుంటుంది. ఈ రైలు నవంబర్‌ 25 వరకు నడుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement