కశింకోట: స్థానిక ఆర్‌ఈసీఎస్ పరిధిలో ఉన్న ఏపీఈపీడీసీఎల్ డివిజన్‌లో పనిచేస్తున్న సీపీడబ్ల్యూలకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలను అమలు చేయాలని ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) జిల్లా గౌరవాధ్యక్షుడు రాజాన దొరబాబు డిమాండ్ చేశారు. సీపీడబ్ల్యూల సమస్యలపై విశాఖలో ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)పృథ్వీరాజ్‌కు శనివారం వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. సీపీడబ్ల్యూల నైపుణ్యం, అర్హత, పని బాధ్యతలకు అనుగుణంగా కనీస వేతనాలు చెల్లించాల్సి ఉన్నా అమలుచేయడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. సీఎండీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు బి.ఈశ్వరరావు, బి.రాజ, అప్పలనాయుడు, అచ్చిబాబు, దాడి లీల తదితరులు పాల్గొన్నారు.


