నక్కపల్లి: తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలవలేదని ఈడీ ఇచ్చిన నివేదిక కూటమి ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదని పాయకరావుపేట నియోజకవర్గం వైఎస్సార్ సీసీ సమన్వయకర్త కంబాల జోగులు అన్నారు. శనివారం ఆయన నక్కపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీపై నిందలు మోపేందుకు కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయంగా వాడుకుందని తెలిపారు. కోట్లాదిమంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసిందన్నారు. విచారణ అనంతరం లడ్డూ తయారీలో జంతువు కొవ్వు కలవలేదని కోర్టుకు ఈడీ నివేదిక సమర్పించిందన్నారు.ఈ నివేదిక చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెప్పుదెబ్బలాంటిదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి అప్రతిష్టపాలు చేయాలని దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఇప్పటికై నా కూటమి నాయకులు, చంద్రబాబు, నారా లోకేష్,పవన్‌కల్యాణ్ బుద్ధి తెచ్చుకుని, తప్పు ఒప్పుకుని లెంపలు వేసుకోవాలన్నారు. కోట్లాదిమంది వేంకటేశ్వర స్వామిని భక్తులను క్షమాపణ చెప్పాలన్నారు.


