స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి

Sep 8 2026 12:53 AM | Updated on Sep 8 2026 12:53 AM

● పార్టీశ్రేణులతో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌

మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌

మునగపాక : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడేలా పాటుపడాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం రాత్రి మునగపాక పంచాయతీ పరిధిలోని పార్టీ పెద్దలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ఎపుడు జరిగినా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకొని వారి విజయం కోసం కష్ట పడి పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. మెజార్టీ స్థానాలను కై వసం చేసుకునేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.

పార్టీ మండల కన్వీనర్‌ ఆడారి అచ్చియ్యనాయుడు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు, మాజీ జెడ్‌పీటీసీ మళ్ల సంజీవరావు, మాజీ సర్పంచ్‌ దిమ్మల అప్పారావు, ఎంపీటీసీ సూరిశెట్టి రాము, పార్టీ పెద్దలు సూరిశెట్టి కన్నారావు, టెక్కలి కొండలరావు, పెంటకోట సత్యనారాయణ,పెంటకోట వెంకట్‌, దాడి సూరిబాబు, దాడి శ్రీరామమూర్తి, పెంటకోట సారథి, పెంటకోట సూరిబాబు, దాడి పోలీసు, మళ్ల రామజగన్నాథం, పెంటకోట శ్రీనివాసరావు, ఆడారి రమణబాబు సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement