ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను వేగవంతం చేసి, కె.కోటపాడు పరిసర ప్రాంతాలకు సాగునీరు అందిస్తామన్న హామీ ఊసు లేకుండా పోయింది. రైవాడ రిజర్వాయర్‌ను గోదావరి జలాలతో అనుసంధానిస్తామన్న ప్రకటన కేవలం ఓట్ల కోసమే అని తేలిపోయింది. చోడవరం నుంచి రోలుగుంట వరకు బీఎన్ రోడ్డు నిర్మిస్తామని ఇచ్చిన హామీ అటకెక్కింది. రోడ్డంతా గోతులు తేలి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోలుగుంట–చోడవరం బీఎన్ రోడ్డు 2023లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్‌తో( 60:40) రూ.112 కోట్లు మంజూరు చేశారు. టీడీపీ కాంట్రాక్టర్ కారణంగా నిలిచిపోతే.. ఎన్నికల ముందు చంద్రబాబు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు తాము అధికారంలోకి వస్తే ఏడాదిలోపే ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా అలానే ఉంది. ఇటీవల కాలంలో పెద్ద పెద్ద గోతులు మృత్యుకుహరాలుగా మారాయి.


