పాయకరావుపేట: మండలంలో ఎస్.నర్సాపురం గ్రామ శివారులో చెరువు వద్ద మట్టి తవ్వుతున్న పొక్లెయిన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ జై.పురుషోత్తం తెలిపారు. శుక్రవారం తెల్లవారుజూమున గ్రామ శివారులో చెరువు వద్దకు వెళ్లి తనిఖీ చేయగా, పొక్లెయిన్ (ఏపీ39 హెచ్‌ఆర్ 4923)తో మట్టి తవ్వుతున్నట్లు గుర్తించి అడ్డుకున్నామన్నారు. సదరు పొక్లెయిన్ డ్రైవరును చెరువు మట్టి తవ్వడానికి సంబంధించి ఏమైనా అనుమతులు, ఇతర అధికారిక పత్రాలు ఉన్నాయా అని ప్రశ్నించగా, ఏమీ లేవని సమాధానమిచ్చారని తెలిపారు. దీంతో పొక్లెయిన్‌ను స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించామన్నారు. తదుపరి చర్యల నిమిత్తం తహసీల్దార్‌కి అప్పగిస్తామని తెలిపారు.


