మాడుగుల మోదకొండమ్మ పాదాలకు కుంకుమ పూజలు చేస్తున్న భక్తులు
మాడుగుల: ఉత్తరాంధ్ర ఇలవేల్పు మాడుగుల మోదకొండమ్మ ఆలయానికి రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వెలసిన అమ్మవారి పాదాలకు ప్రత్యేక కుంకుమ పూజలు చేశారు.
ఇంటికి గుర్తుతెలియని వ్యక్తి నిప్పు
నక్కపల్లి: మండలంలోని ఎస్. నర్సాపురంలో ఎస్. వరహాలు అనే మహిళ పెంకుటిల్లుకు గుర్తుతెలియని వ్యక్తి నిప్పు పెట్టాడు. శుక్రవారం తెల్లవారుజామున నిప్పు పెట్టడంతో ఇల్లు అగ్నికి ఆహుతైంది. ఇదే ఇంటి పక్కన ఉన్న పోతంశెట్టి త్రిమూర్తులు ఇంటిపై సోలార్ ప్యానళ్లు కూడా కాలిపోయాయి. సమాచారం అందిన వెంటనే సీఐ మురళి తన సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


