చైర్మన్ సతీష్ కుమార్
రోలుగుంట: ప్రస్తుతం అమలులో ఉన్న గ్రంథాలయ పని వేళల్లో మార్పులు చేయాలని ప్రతిపాదనలు పంపినట్టు ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ చైర్మన్ వి.సతీష్ కుమార్ తెలిపారు. పాఠకులకు అను కూలంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ గ్రంథాలయాలు పని చేయడానికి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఉమ్మడి విశాఖలో 67 గ్రంథాలయాలకు 142 మంది సిబ్బంది అవసరం కాగా 42 మంది మాత్రమే ఉన్నారని, ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరామన్నారు. అనకాపల్లి జిల్లా రూ.35 కోట్లు, అల్లూరి జిల్లా రూ.80 కోట్లు, జీవీఎంసి రూ.250 కోట్లు సెస్ బకాయిలు విడుదల చేయాలని ఆయా జిల్లాల డీపీవోలకు వినతిపత్రం పంపామన్నారు.


