రావికమతం: విశాఖపట్నం బీచ్‌రోడ్డులోని పాండురంగాపురం వద్ద ఉన్న ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టేట్ పారా ట్రయాథ్లాన్ (స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్) చాంపియన్ షిప్–2026 పోటీల్లో పీటీఎస్–3 విభాగంలో రావికమతం మండలానికి చెందిన ముగ్గురు దివ్యాంగ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ స్టేట్ లెవల్ పోటీల్లో మేడివాడకు చెందిన గంటా బాబూరావు ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణం, చినపాచిల గ్రామానికి చెందిన సలాది మురళి ద్వితీయ స్థానంలో నిలిచి రజతం, మేడివాడ గ్రామానికి చెందిన కొట్యాడ రాము తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు. వీరికి అసోసియేషన్ ప్రెసిడెంట్ సీతల్ దేవి మెడల్స్, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. పతకాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేక ఉపాధ్యాయులు మహాలక్ష్మి నాయుడు, మండల విద్యాశాఖాధికారులు లింగమూర్తి, బ్రహ్మాజీ, మేడివాడ ప్రధానోపాధ్యాయుడు వంకాయల రామారావు అభినందించారు.


