వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడుగా బొడ్డేడ ప్రసాద్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడుగా బొడ్డేడ ప్రసాద్‌

Mar 4 2026 7:34 AM | Updated on Mar 4 2026 7:34 AM

సాక్షి, అనకాపల్లి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బొడ్డేడ ప్రసాద్‌ను నియమించారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. బొడ్డేడ ప్రసాద్‌ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. తరువాత 2023 ఆగస్టు నెలలో రెండో సారి(అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా) పనిచేశారు. మూడోసారి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆయనకు అవకాశం కల్పించారు. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గవర కార్పొరేషన్‌ చైర్మన్‌గా, అరకు పార్లమెంట్‌ పరిశీలకులుగా, అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్తగా పనిచేశారు. ఈ సందర్భంగా బొడ్డేడ ప్రసాద్‌ మాట్లాడుతూ తనను నమ్మి జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన మాజీ సీఎం వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

జిల్లా స్థాయి టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ మాస్టర్‌ పోటీలు

అనకాపల్లి : రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి టెన్నిస్‌ (మాస్టర్స్‌– 40 సంవత్సరాలు) పురుషులు, మహిళలు సింగిల్స్‌, డబుల్స్‌ పోటీలు బాడ్మింటన్‌ మాస్టర్‌ 35 సంవత్సరాల పురుషులు, మహిళలకు ఈనెల 8న ఉదయం 8 గంటలకు జిల్లాలో పరవాడ మండలం కేవీకేలో ఎంపిక పోటీలు జరుగుతాయని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి పూజారి శైలజ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 22, 23 తేదీల్లో విజయనగరంలో రాష్ట్రస్థాయి టెన్నిస్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికైన వారికి అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఈనెల 14, 15 తేదీల్లో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ మాస్టర్‌ పోటీలు జరుగుతాయన్నారు. అర్హులైన క్రీడాకారులు ఆధార్‌ జెరాక్స్‌, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో అందజేయాలని, క్రీడాకారులు ముందుగా https://sports.ap. gov.inలో నమోదు చేసుకోవాలని ఆమె కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement