చిన్నయ్యపాలెంలో వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలు చించివేత
బుచ్చెయ్యపేట : మండలంలో పెదపూడి శివారు చిన్నయ్యపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను కూటమి నేతలు చించివేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గ్రామానికి చెందిన మండల సోషల్ మీడియా కన్సీనర్ అయితి రాము, వైఎస్సార్‌సీపీ గ్రామ అధ్యక్షుడు చందక దేముడు, ఉప సర్పంచ్ ఉప్పిలి అప్పలరాజు తదితరులు గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగనన్న ఫొటోలతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, మండల నాయకులు ఇతర నాయకులతో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన కూటమి నేతలు కక్ష సాధింపు చర్యగా ఫ్లెక్సీలను చించివేశారని నాయకులు తెలిపారు. తమ అధినాయకుడు జగనన్న కటౌట్లు చూసి ఓర్వలేకపోతున్నారని, ప్రశాంతంగా ఉన్న గ్రామంలో గొడవలు సృష్టించాలని కూటమి నేతలే ఫ్లెక్సీలను చించివేశారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం చెందారు. పోలీసులు గ్రామంలో ఫ్లెక్సీలను చించివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ గోకివాడ వరకృష్ణ కోరారు.
చిన్నయ్యపాలెంలో వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలు చించివేత
చిన్నయ్యపాలెంలో వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలు చించివేత


