రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
పద్మనాభం: మండలంలోని విజయానందరం జంక్షన్‌లో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా జామి మండలం కొత్త భీమసింగ్‌కు చెందిన పాండ్రంగి వెంకటేష్ (34) విజయనగరం వై జంక్షన్‌లో పాన్ షాపు, పార్లర్ షాపు నిర్వహిస్తున్నాడు. షాపుల నుంచి పని ముగించుకుని మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై స్వగ్రామమైన కొత్త భీమసింగ్ వస్తుండగా మార్గంమధ్యలో విజయానందపురం జంక్షన్‌లో ఎస్టీ కాలనీ సమీపంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో వెంకటేష్‌కు కుడి చేయి విరిగిపోయింది. ముక్కులో నుంచి రక్తం వచ్చింది. స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్సు సంఘటన స్థలానికి చేరుకునేటప్పటికే వెంకటేష్ మృతి చెందాడు. మృతుడికి భార్య సత్యలత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సత్యలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం


