త్యాగాలు మావి... లబ్ధి వాళ్లకా
నక్కపల్లి: అడ్డురోడ్డు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నక్కపల్లిని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాను కంపెనీలకోసం భూములు ఇవ్వాలని హోంమంత్రి వంగలపూడి అనిత పదే పదే చెప్పేవారని, ఆమె మాటలు నమ్మి కంపెనీలు వస్తే మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, రాజకీయంగా, పరిపాలనా పరంగా కూడా అభివృద్ధి చెందుతుందని ఆశతో భూములు త్యాగం చేశామని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో చివరి నిమిషంలో అన్యాయం చేశారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. నక్కపల్లి మండల కేంద్రానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. బ్రిటీష్ కాలంనుంచి నక్కపల్లి తాలూకా కేంద్రంగా ఉంది. ఇక్కడ నుంచి రెవెన్యూకు సంబంధించిన ముఖ్యకార్యకలాపాలు జరుగుతుంటాయి. లోక్‌సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ అంతా నక్కపల్లి నుంచే జరుగుతుంది. మండల వ్యవస్థ ఏర్పాటు కాకముందు నక్కపల్లి తాలూకా కేంద్రంగానే పాయకరావుపేట, ఎస్.రాయవరం నక్కపల్లి మండలాల్లో రెవెన్యూ కార్యకలాపాలు జరిగేవి. తాలూకాలకు అనుబంధంగా నక్కపల్లి, గొడిచర్ల ,పాయకరావుపేట, కోటవురట్ల, శ్రీరాంపురం ఎస్.రాయవరం ఫిర్కాలు ఉండేవి. నక్కపల్లిలో సబ్‌రిజిస్టార్ కార్యాలయం,ఉపఖజానా గ్రామీణ నీటి సరఫరా విభాగం డివిజన్ ఇంజినీర్ కార్యాలయం ఇక్కడే ఉండేవి. 31 పంచాయతీలు, సుమారు 65 వేలకుపైగా జనాభాకలిగిన నక్కపల్లి మండలానికి 2004నుంచి మహర్దశ పట్టింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రోత్సాహంతో నక్కపల్లిలో హెటెరో రసాయన పరిశ్రమ ఏర్పాటైంది. సుమారు 500 ఎకరాల్లో ఈ కంపెనీఏర్పాటవడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. అక్కడనుంచి భూముల ధరలకు రెక్కలు రావడంతో రియ ల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. అలాగే పాయకరావుపేట మండలంలో కూడా దక్కన్ కంపెనీ రావడంతో అక్కడ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరో 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. నక్కపల్లి మండలంలో ఏడు మత్స్యకార గ్రా మాలున్నాయి. కంపెనీలకు అనువైన అన్ని వనరులు ఇక్కడ ఉండటంతో ప్రభుత్వం దృష్టి నక్కపల్లి మండలంపై పడింది. 2010లో ప్రభుత్వం మండలంలో పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణకు సిద్ధమైంది. 2014లో టీడీపీ ప్రభుత్వం ఎస్‌ఈజడ్ ఏర్పాటు కోసం ఏపీఐఐసీ ద్వారా 5వేల ఎకరాలను సేకరించింది. నక్కపల్లి మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది, ఉపాధి, ఉద్యోగావకాశాలు కలుగుతాయన్న ఆఽశతో రైతులంతా తమ భూములను త్యాగం చేశారు. రాజకీయ, భౌగోళిక పరంగా కూడా నక్కపల్లి మండలం గుర్తింపు పొందుతుందని ప్రజలంతా ఆశపడ్డారు. తాజాగా రూ.67వేల కోట్ల వ్యయంతో ఆర్సిలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకానుంది. స్టీల్‌ప్లాంట్ కోసం కూడా రైతులు భూములు త్యాగం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో నక్కపల్లి కేంద్రంగా కొత్త రెవెన్యూడివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన మండల ప్రజలను ఎంతో ఆనందంగా కలిగింది.ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ రెవెన్యూ డివిజన్‌ను అడ్డురోడ్డుకేంద్రంగా ఏర్పాటుచేయడం పట్ల మండల ప్రజలు ,రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.కంపెనీలకోసం భూములు మేము త్యాగం చేయాలి. పేరుప్రఖ్యాతలు, రెవెన్యూ డివిజన్‌ను మా త్రం అడ్డురోడ్డు కేంద్రంగా ఏర్పాటు చేస్తారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అడ్డురోడ్డు అనేది రెండు గ్రామాలపరిదిలో ఉంటుందని మండల కేంద్రంగాని,మేజర్ పంచాయతీగాని కాకుండా కేవలం వాణిజ్య కేంద్రంగా ఉన్న ఇక్కడ రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం తగదని పలువురువ్యాఖ్యానిస్తున్నారు. వేలా ది ఎకరాలను నక్కపల్లి మండలంనుంచి సేకరించి రైతులకు 2013 భూసేకరణ చట్టప్రకారం నష్టపరిహారం ఆర్‌అండ్ ఆర్‌ప్యాకేజీ చెల్లించకుండా అన్యా యం చేశారని,కనీసం రెవెన్యూడివిజన్ అయినా ఇక్క డ ఏర్పాటు చేస్తే సంతోషించేవాళ్లమని రైతులు చెబుతున్నారు. భూములు త్యాగం చేసేది మేము,డివిజన్ కేంద్రం మాత్రంసెంటుభూమికూడా సేకరించని అడ్డురోడ్డులో ఏర్పాటు చేస్తారా అంటూ వాపోతున్నారు.
అడ్డురోడ్డు కేంద్రంగా ఏర్పాటు చేయడం దారుణం
నక్కపల్లి మండలంలో రైతులు పరిశ్రమల కోసం వేలాది ఎకరాలు భూములు త్యాగం చేశారు. నష్టపరిహారం విషయంలో అన్యాయం జరిగినప్పటికీ పారిశ్రామికంగా పరిపాలనా పరంగా అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డారు. నక్కపల్లి కేంద్రంగా కొత్త రెవెన్యూడివిజన్ ఏర్పాటు చేస్తున్నామంటే ఆశపడ్డారు. చివరకు నక్కపల్లికాకుండా అడ్డురోడ్డు కేంద్రంగా రెవె న్యూ డివిజన్ ఏర్పాటు చేయడం దారణం. కంపెనీల కోసం భూములు త్యాగం చేసిన రైతులను ప్రభుత్వం మోసం చేసింది. – వీసం రామకృష్ణ,
వైఎస్సార్‌సీపీ రాష్ట్రకార్యదర్శి
త్యాగాలు మావి... లబ్ధి వాళ్లకా


