వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
దేవరాపల్లి: ఇంటర్ పరీక్షలకు విద్యార్థులను ప్రణాళిక ప్రకారం సిద్ధం చేస్తున్నట్టు జిల్లా ఇంటర్ బోర్డు విద్యాధికారి ఎం. వినోద్‌బాబు తెలిపారు. విద్యాపరంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు చెప్పారు. దేవరాపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం 48వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ బి. రాధ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ముఖ్యఅథితిగా వినోద్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు 2,862 మంది, ఫస్టియర్ విద్యార్థులు 3, 261 మంది పరీక్షలకు సిద్ధమవుతున్నారన్నారు. 2026 సంకల్పం కార్యక్రమం ద్వారా అదనపు తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. జనవరి 21 నుంచి మానవతా విలుపులపై పరీక్షలు, ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఏ,బీ,సీ గ్రేడింగ్ విధానం అమలు చేసి, సీ గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధ్యాపకులకు సూచించారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ


