వించ్ ప్రయాణం అమోఘం
● ఒడిశా జలవిద్యుత్ శాఖ ఉన్నతాధికారి ప్రణబ్‌కుమార్
మంచు కొండల్లో వేడివేడి విందు
●హరితా రిసార్ట్‌లో ప్రత్యేక వంటకాలు
ముంచంగిపుట్టు: మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి వెళ్లే వించ్ ప్రయాణం అమోఘమని ఒడిశా జలవిద్యుత్‌శాఖ ఆర్థిక సంచాలకుడు ప్రణబ్‌కుమార్ అన్నారు. ఆంధ్రా ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. వించ్‌లో ప్రాజెక్ట్‌కు చేరుకున్నారు. మధురానుభూతి పొందారు. వించ్ వివరాలను ప్రాజెక్టు అధికారుల నుంచి తెలుసుకున్నారు. విద్యుత్ కేంద్రంలో జనరేటర్ల పనితీరు, విద్యుత్ ఉత్పత్తి వివరాలపై ఆరా తీశారు. శతశాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండడంపై ఆయన ప్రాజెక్టు అధికారులను,సిబ్బందిని అభినందించారు. పలు రికార్డులను పరిశీలించారు. స్థానిక ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు,సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ గోవిందరాజులు, ఓహెచ్‌పీసీ జీఎం నిర్మల్‌కుమార్ ,మాచ్‌ఖండ్ ఈఈ సివిల్ కురేషిప్రధాన్, డిప్యూటీ ఈఈలు చంద్ర ఓబుల్‌రెడ్డి, వెంకటమధు,చిరంజీవి పాల్గొన్నారు.


