
మీ చేతుల్లోనే ఆరోగ్యం, భవిష్యత్తు
క్విజ్ పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లు అందజేస్తున్న డీఎంహెచ్‌వో హైమావతి
అనకాపల్లి: మీ ఆరోగ్యం, భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని డీఎంహెచ్‌వో వై.హైమావతి విద్యార్థులకు సూచించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో పలు జూనియర్ కళాశాలల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు ఆమె శుక్రవారం సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని, మంచి అలవాట్లు నేర్చుకోవాలని సూచించారు. కష్టపడి చదువుకోవడం కంటే ఇష్టపడి చదువుడం వల్ల ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ, నివారణ సంస్థ ఉద్యోగులు, సీఎస్‌వో స్పందన ప్రశాంతి, ఐసీటీసీ కౌన్సిలర్స్ ప్రసాద్‌రాజు తదితరులు పాల్గొన్నారు.