
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఒప్పుకోం
వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల నిరసన
డాబాగార్డెన్స్: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తమ గళం వినిపించారు. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈవోఐ) పేరుతో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌లోని 44 విభాగాలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ వారు శుక్రవారం జీవీఎంసీ ప్రధాన గేటు వద్ద నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడారు.