
దొండపూడిలో ఘనంగా దుర్గాలమ్మ పండగ
రావికమతం: దొండపూడి గ్రామ ఆరాధ్య దైవం దుర్గాలమ్మ అమ్మవారి పండగ గురువారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రులు ఆర్.కె.రోజా, గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యేలు అదీప్‌రాజ్, చింతలపూడి వెంకట్రామయ్య, అనకాపల్లి జిల్లా యూత్ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, చోడవరం ఎమ్మెల్యే రాజు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మాజీ మంత్రి వీరభద్రరావు, ప్రభుత్వ విప్ గణబాబు, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.