
నేలబావిలో జారిపడి యువకుడి మృతి
యలమంచిలి రూరల్ : పట్టణానికి సమీపంలో గురువారం శేషుగెడ్డ వద్ద నేల బావిలో జారిపడి కటారి రాజేష్(23) అనే యువకుడు మృతి చెండాడు. కశింకోట మండలం నర్సింగబిల్లి జంగాల కాలనీకి చెందిన రాజేష్, స్నేహితుడు కట్టుమూరు మధుతో కలిసి చేపలు పట్టడానికి 16వ నెంబరు జాతీయ రహదారి పక్కన శేషుగెడ్డ వద్ద కొబ్బరి తోటలో ఉన్న నేల బావి వద్దకు వచ్చారు. చేపలకు గాలం వేసిన సమయంలో కటారి రాజేష్ ప్రమాదవశాత్తూ బావిలోకి జారి పడ్డాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న కటారి రాజేష్ తండ్రి, కుటుంబసభ్యులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని కుమారుడి మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ కె.సావిత్రి తెలిపారు.