
పరారీలో ఉన్న గంజాయి నిందితుడి అరెస్ట్
యలమంచిలి రూరల్: జాతీయ రహదారిపై యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి రేగుపాలెం వద్ద 2021లో 220 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ కేసులో పోలీసులు ఏ1 గా పేర్కొన్న నిందితుడు అంబర్ ఖాన్(30)ని మధ్యప్రదేశ్‌లోని షాజపూర్ జిల్లా జామ్నర్, వీటీసీ, ఛత్రబాస్ దగ్గర యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర, మరో ఇద్దరు పోలీసుల బృందం అరెస్ట్ చేసి బుధవారం యలమంచిలి తీసుకొచ్చారు. అనంతరం విశాఖపట్నం కోర్టులో హాజరుపర్చగా నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసులో నలుగురు నిందితుల్లో ఇద్దర్ని 2021లో అరెస్టు చేయగా ఇద్దరు తప్పించుకుని తిరుగుతున్నారు. వీరిలో ఒకర్ని అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నాడు.