
డివైడర్‌ను ఢీకొట్టిన కారు
మాకవరపాలెం: రోడ్డుమధ్యలో ఉన్న డివైడర్‌ను కారు ఢీ కొట్టింది. తాళ్లపాలెం వైపు నుంచి నర్సీపట్నం వెళుతున్న కారు బుధవారం రాత్రి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు వద్దకు వచ్చేసరికి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఒక్కసారిగా ఢీ కొట్టింది. దీంతో కారు ముందు భాగం దెబ్బతింది. కారులో ఉన్న వ్యక్తి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎదురుగా వస్తున్న వాహన లైట్ల వెలుగులో డివైడర్ కనిపించక పోవడంతోనే ఢీకొట్టినట్టు కారు యజమాని తెలిపాడు. డివైడర్‌కు రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక బోర్టులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.