
జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపిక
పాయకరావుపేట: కాకినాడలో జరిగిన సీబీఎస్‌ఈ సౌత్ జోన్ యోగా పోటీలకు శ్రీ ప్రకాష్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్–14 బృందం విభాగంలో చైతన్యసాగర్ నాయుడు, మౌళీశ్వరి, వి.చైతన్య తేజ, ఆశ్రిత్ చరణ్ కుమార్, వ్యక్తిగత విభాగంలో చరణ్‌కుమార్, అండర్ –17 బృంద విభాగంలో జి.సోమ సూర్యచరణ్, బి.దేవాన్త్ నాయుడు, పి.సోహన్, సిహెచ్.జయదీప్, రక్షిత్, సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 16 వరకు శ్రీరామ్ గ్లోబల్ స్కూల్, న్యూవల్, హరియాణాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సంప్రదాయ ఈవెంట్‌లో జి.సోమ సూర్యచరణ్ బంగారు పతకం, దేవన్త్ నాయుడు రజత పతకం, సిహెచ్ రక్షిత్ కాంస్య పతకం, పి.సోహన్ 4వ స్థానం సాధించారు. ఆయా విద్యార్థులను విద్యా సంస్థల అధినేత నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ మూర్తి, యోగా గురువులు సురేష్, జయంతి అభినందించారు.