
పొలాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి
దేవరాపల్లి: భారీ వర్షాలకు నీటి ముంపునకు గురైన పంట పొలాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.మోహన్‌రావు రైతులకు సూచించారు. ఈ మేరకు మండలంలోని ఎం.అలమండ, కొత్తపెంట, తారువ, పెదనందిపల్లి, చిననందిపల్లి, దేవరాపల్లి గ్రామాల్లో సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటించి వరి పొలాలను పరిశీలించారు. పొలాల్లో చేరిన నీటిని గట్లు తెగ్గొట్టి భయటకు పోయేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండలంలో 19 గ్రామాల్లో సుమారు 270 ఎకరాల్లో నీరు నిల్వ ఉండటాన్ని గుర్తించామన్నారు.
తహసీల్దార్ పి.లక్ష్మీదేవి, ఎంపీడీవో ఎం.వి.సువర్ణరాజు రైవాడ జలాశయంతో పాటు లోతట్టు పంట పొలాలు, శారదానదీ పరివాహక ప్రాంతాలలో పర్యటించారు. ముషిడిపల్లిలో నాగారాయుడు చెరువు, తామరబ్బ వంతెన వద్ద శారదానది ఉధృతిని పర్యవేక్షించారు. అప్రమత్తంగా ఉండాలని రైతులకు, స్థానిక ప్రజలకు సలహాలు, సూచనలు చేశారు.