
నీటమునిగిన పంటలు పరిశీలించిన అధికారులు
కె.కోటపాడు : భారీ వర్షాలకు ముంపునీటిలో ఉన్న పంటలను ప్రాథమికంగా వ్యవసాయశాఖ అధికారులు గుర్తించాలని జిల్లా వ్యవసాయాధికారి బి.మోహనరావు ఆదేశించారు. మండలంలో సోమవారం ఉదయం వర్షం కురుస్తున్నా మండల వ్యవసాయధికారి సోమశేఖర్‌తో కలిసి మేడిచర్ల, ఎ.భీమవరం, కె.కోటపాడు గ్రామాల్లో నీట మునిగిన వరి పంటను గుర్తించారు. వర్షం తగ్గాక నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు. తరువాత నేనో యూరియాను ఎకరానికి 500 ఎంఎల్ పిచికారి చేయాలని, పంటకు కుళ్లు తెగులు ఆశిస్తే హెక్సా కోనజోల్ ఎకరానికి 400 ఎంఎల్ పిచికారి చేయాలని సూచించారు.